ఏపీ అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన (వీడియో)

0
286

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలపై సినీనటుడు ఎన్టీఆర్‌ స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణమేనని, అవి ప్రజా సమస్యలపై జరగాలే తప్ప వ్యక్తిగత దూషణల జోలికి పోవడం సరికాదని అన్నారు.

ముఖ్యంగా ఆడపడుచులపై పరుష పదజాలంతో మాట్లాడడం ఒక అరాచక పాలనకు నిదర్శనం అని గుర్తు చేసుకోవాలి. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. మన నవనాడుల్లో ఇమిడిపోయిన ఒక సంస్కృతి. ఈ మాటలు నేను వ్యక్తిగత విమర్శలు గురైన కుటుంబంలోని వ్యక్తిగా మాట్లాడడం లేదు. నేను ఒక కొడుకుగా, తండ్రిగా, భర్తగా ఈ దేశానికి ఒక పౌరుడిగా మాట్లాడుతున్న. చివరగా రాజకీయ నాయకులకు ఒక విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ముగింపు పలకండి. ప్రజాసమస్యలపై పోరాడండి అంటూ ఎన్టీఆర్ కోరారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/600664281143373