వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఈసారి దారుణమైన ఫలితాలు వస్తాయి అంటున్నారు తెలుగుదేశం నేతలు. ముఖ్యంగా కడప జిల్లాలో వైయస్ ఫ్యామిలీ తమకు కంచుకోటగా చెప్పుకుంటుంది.. కాని ఈసారి ఇక్కడ ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయి అంటున్నారు నాయకులు. దీనికి కారణం కూడా ఉంది. జగన్ పై జనాల్లో నమ్మకం లేదు అంటున్నారు. అంతేకాదు తెలుగుదేశం సంక్షేమ కార్యక్రమాలు పధకాలు కూడా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి అని, అందుకే జగన్ రావాలి అని ఎవరూ కోరుకోవడం లేదట.
ఇక ఆదినారాయణ రెడ్డి కూడా సీమలోముఖ్యంగా కడపలో చాలా పేరు తెచ్చుకున్నారు.. మంత్రిగా జిల్లాలో అభివృద్దిలో తనదైన ముద్ర వేశారు.. అందుకే ఆయనకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు కూడా ఉంది అని చెబుతున్నారు, ఈసారి కచ్చితంగా కడప నుంచి పార్లమెంట్ కు ఆదినారాయణ రెడ్డి వెళతారు అని ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెబుతున్నారు. ఇది వైయస్ కుటుంబానికి మరో నెగిటీవ్ రికార్డు అవుతుంది అంటున్నారు జిల్లా నేతలు.