విద్యార్దులకి కేంద్రం సూపర్ న్యూస్ బడ్జెట్ లో విద్యార్దులకి తీపికబురు వరాలు

విద్యార్దులకి కేంద్రం సూపర్ న్యూస్ బడ్జెట్ లో విద్యార్దులకి తీపికబురు వరాలు

0
87

కేంద్రంమంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టారు… ఇందులో పలు రంగాలకు కేటాయింపుల గురించి తెలియచేశారు..కేంద్రం బడ్జెట్ లో విద్యార్దులకు విద్యారంగానికి గుడ్ న్యూస్ చెప్పింది.. దేశంలో విద్యావ్యవస్దలో చాలా మార్పులు తీసుకురానుంది మరి ఆ వివరాలు చూద్దాం.

2030 నాటికి అత్యధిక యువత భారత్ లోనే ఉంటారు అని కేంద్రం తెలిపింది .. అలాగే స్థానిక సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్ విధానం అమలు చేయనున్నారు..విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నారు. విద్యాలయాల కోసం భూమి కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు ప్రయోజనాలు ఇవ్వనున్నారు.

విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పేరిట కొత్త కార్యక్రమం ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. అలాగే విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వనున్నారు.. విద్య, స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టిసారించనుంది కేంద్రం. 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులు ప్రవేశం కానున్నాయి. జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానం చేయనున్నారు.
అలాగే వైద్య పీజీ కోర్సుల కోసం పెద్దాసుపత్రులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నారు.. మన దేశంలో వర్శిటీల కోసం త్వరలో జాతీయ స్థాయి విధానం అమలు చేయనున్నారు.. అలాగే మన దేశంలో ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్లైన్లో డిగ్రీ కోర్సులు ప్రారంభించనున్నారు.