జన సేన అధినేత, సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్‌పై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాన్ జనసేప పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాడు. అయితే గత ఎన్నికల్లో పవన్ టీడీపీకి సపోర్టు ఇచ్చి, ఈ ఎన్నికల్లో కొత్తగా పార్టీ స్థాపించి, పోటీ చేశారు. అయితే జనసేన అన్ని విధాలుగా యాత్రలు చేసి ఎన్నికల ప్రచారం కొనసాగించినప్పటికీ ఒకే ఒక్క సీటును రాబట్టింది. పార్టీ అధినేత అయిన పవన్ రెండు నియోజగవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు. దీంతో పవన్ కళ్యాన్ టీడీపీ ఓట్లను చీలినట్టై ఒక్కసారిగా ఆ పార్టీ ఘోరా పరాజయం పాలైంది.
దీంతో టీడీపీ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమని సీనియర్ నటుడు సుమన్ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. తాను పుట్టిన తర్వాత ఒకే పార్టీకి ఇన్ని సీట్లు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. ఎన్నో కష్టాలు పడి జగన్ ఘనవిజయం సాధించారని అభినందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సమన్యాయం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. సినిమా పరిశ్రమ కూడా ఏపీకి తీసుకిచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని జగన్ కు సూచించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన పై వ్యాఖ్యాలు చేశారు. అయితే సుమన్ వ్యాఖ్యాలపై, టీడీపీ, జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి..