ఎస్వీబీసీ ఉద్యోగినికి ఐలవ్యూ చెప్పడంపై క్లారిటీ ఇచ్చిన పృథ్వీరాజ్

ఎస్వీబీసీ ఉద్యోగినికి ఐలవ్యూ చెప్పడంపై క్లారిటీ ఇచ్చిన పృథ్వీరాజ్

0
100

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తాను శ్రీ వెకంటేశ్వర స్వామి మీద ఒట్టు అలాగే దేవుడుగా భావించే వైఎస్ జగన్ మోహన్ రెడ్డమీద ఓట్టు వేసి చెబుతున్నానని తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు…

విచారణ చేస్తే నిజనిజాలు బయటపడుతాయని అన్నారు… ఛానల్ లో తాను ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నారు.. తాను తాగుబోతు లంచగుండీ అని నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమే అని అన్నారు…

కాగా పృథ్వీరాజ్ మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతితెలిసిందే… నువ్వంటే ఇష్టమని తన గుండెల్లో ఉన్నావని… లవ్యూ అంటూ ఫోన్లో పార్ట్ టైమ్ ఉద్యోగినితో మాట్లాడారు… అంతేకాదు తాను ప్రస్తుతం మధ్యం మానేశానని తాగడమంటూ జరిగితే అది నీవద్దే కూర్చొని తాగుతానంటూ ఈ ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడారు.. అంతేకాదు గతంలో ఛానల్ కార్యాలయంలోనే వెనుక వచ్చి పట్టుకుందామని అనుకున్నానని ఎక్కడ భయపడి అరుస్తావోనని ఆగిపోయానని అన్నారు…