తెలుగుదేశం పార్టీలో జేసీ కుటుంబం ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది చర్చ జరుగుతోంది, ముఖ్యంగా టీడీపీకి ఇప్పుడు వచ్చిన సంక్షోభం కొందరు నేతలకు టెన్షన్ పెట్టిస్తోంది.. అనంత జిల్లాని ఏలిన నేత గా జేసి దివాకర్ రెడ్డి ఉన్నారు, కాని ఈబ్రదర్స్ వారి వారసులని ఈసారి ఎన్నికల రంగంలోకి దించారు. కనివిని ఎరుగని రీతిలో ఇక్కడ ఓటమి పాలయ్యారు.
అయితే జేసీ దివాకార్ రెడ్డి ఎలా ఉన్నా ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం తాడిపత్రిలో వైసీపీ మాత్రం అదరగొడుతోంది అంటున్నారు అక్కడ జనం…ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున నేతలు పార్టీలో చేరడంతో టీడీపీలో జేసి కుటుంబం నిలుస్తుందా అంటున్నారు.. అయితే ఇప్పటికీ ప్రభాకర్ రెడ్డి యాక్టీవ్ గా ఉన్నారు కాని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఓటమి తర్వాత పెద్దగా తాడిపత్రిని పట్టించుకోవడం లేదు అని అంటున్నారు కొందరు, అయితే ఇక్కడ టీడీపీ కి మాత్రం అస్మిత్ రెడ్డి మాత్రమే లీడర్ అని కేడర్ భావిస్తోంది. మరి జేసీ కుమారులు వచ్చే రోజుల్లో అయినా దూసుకుపోవాలి అని కోరుతున్నారు అక్కడ టీడీపీ లీడర్స్.