తెలంగాణ‌లో మాంసం షాపుల‌కి స‌రికొత్త రూల్స్

తెలంగాణ‌లో మాంసం షాపుల‌కి స‌రికొత్త రూల్స్

0
32

దేశ వ్యాప్తంగా ఈ వైర‌స్ ఇప్పుడు అప్పుడే వ‌దిలేలా లేదు, అందుకే లాక్ డౌన్ కొన‌సాగిస్తూ ప్ర‌జ‌ల‌కు కొన్ని స‌డలింపులు ఇస్తోంది కేంద్రం.. ఇక రెడ్ జోన్లు కంటైన్మెంట్లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో నెమ్మ‌దిగా షాపులు తెర‌చుకుంటున్నాయి. ఇక చికెన్ మ‌ట‌న్ షాపులు కూడా తెర‌చుకుంటున్నాయి.

అందుకే తెలంగాణ‌లో ఇలా నాన్ వెజ్ అమ్మేషాపుల‌కి కొన్ని రూల్స్ పెట్టింది ప్ర‌భుత్వం, ఇవి పాఠించ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాము అన్నారు..ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
మ‌రి ఆ కండిష‌న్స్ ఏమిటో చూద్దాం.

క‌చ్చితంగా మాంసం దుకాణాల ద‌గ్గ‌ర చెత్త బుట్ట‌లు ఉండాలి, చెత్త అక్క‌డే వేయాలి, చెత్త వేసే వాటికి చిల్లులు రంధ్రాలు ఉండ‌కూడ‌దు, దీని వ‌ల్ల వేస్టేజ్ బ‌య‌ట‌కు వ‌స్తుంది.. అందుకే ఇలా ఉండ‌కూడ‌దు, మాంసం కోసే క‌త్తులు ఎప్పుడూ వేడి నీటితో క‌డ‌గాలి.షాపుల్లో పని చేసే వారు ఆప్రాన్, గ్లౌజులు, హెడ్ గేర్ ధరించాలి…. ఇక మాంసం దుకాణాల్లో ప‌నిచేసే వారికి స్కిన్ ప్రాబ్లం ఉండ‌కూడ‌దు. గోర్లు అస్స‌లు పెంచుకోకూడ‌దు. దుకాణం తెరిచిన వెంట‌నే బ్లీచింగ్ చ‌ల్లాలి. ఈగ‌లు దోమ‌లు వాల‌కుండా చూసుకోవాలి.