తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు… ఇప్పటికి ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే…

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు... ఇప్పటికి ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే...

0
46

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది… రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి… ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారిద్వారా రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని నిర్థారణ అయింది…

దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది అయినా కూడా ఈ వైరస్ అరికట్టలేకపోతున్నారు… ఇప్పటికే 33 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి…

ఈ ముగ్గురు విదేశాల నుంచి వచ్చినవారే… జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు తాజాగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారించారు అలాగే సౌదీ నుంచి వచ్చిన 61 ఏళ్ళ మహిళతోపాటు లండన్ నుంచి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి సైతం కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారించారు…