తెలంగాణలో ఇప్పటికే 59 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి.. అందుకే అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు చెబుతున్నారు, అలసత్వమే మరింత ప్రమాదం అంటున్నారు.
ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లడానికి ఛాన్స్ లేదు, అయితే మరిన్ని కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో కొన్ని రెడ్ జోన్లు ప్రకటించింది.రెడ్ జోన్లలోని ప్రజలు 14 రోజులపాటు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కొత్తపేట, తుర్కయాంజల్, గచ్చిబౌలి, కోకాపేట, చందానగర్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. వీరు బయటకు రావడానికి లేదు కేవలం సరుకులు అన్నీ ప్రభుత్వమే అందిస్తుంది. ఇక్కడకు కిలోమీటరు పరిధిలో చెక్ పోస్టు పెడతారు ఎవరూ బయటకు రాకూడదు, వస్తే కఠిన చర్యలు ఉంటాయి, వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి అక్క డ పోలీసులకి వైద్యులకి.