తెలంగాణలో మందు బాబులకు మరో షాక్ – కీలక నిర్ణయం

తెలంగాణలో మందు బాబులకు మరో షాక్ - కీలక నిర్ణయం

0
84

ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మరిన్ని కొత్త కేసులు నమోదు అవుతున్నాయి, దీంతో అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు అధికారులు… అయితే కొందరు భౌతిక దూరం పట్టించుకోవడం లేదు మాస్క్ ధరించడం లేదు దీంతో షాపుల దగ్గర కొందరికి ఫైన్ కూడా వేస్తున్నారు.

అయితే మద్యం షాపులు తెరవడంతో ఇప్పుడు బారులు తీరుతున్నారు మందుబాబులు…హైదరాబాద్లో మందుబాబులకు కొత్త రూల్స్ తీసుకొచ్చారు ఎక్సైజ్ అధికారులు. కాస్త జ్వరం ఉన్నా సరే వారికి లిక్కర్ని అమ్మకూడదని తెలిపారు. ఇకపై వైన్ షాపులకు వచ్చే కస్టమర్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.

అందులో వారికి సాధారణ ఉష్ణోగ్రత సూచించినట్లైతేనే లిక్కర్ కొనుగోలు సెంటర్కి అనుమతించనున్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతల్లో తేడా వస్తే అటునుంచే అటే వెనక్కి పంపనున్నారు. సో ఏదైనా అనారోగ్యం జ్వరం ఉంటే వైన్ షాపులకి రాకండి. ఇక మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ కూడా వేస్తారు.