ఈ రోజు ఉదయం నుంచి కియ ప్లాంట్ గురించి చర్చ జరుగుతోంది.. అది ఏపీ నుంచి తరలి పోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. చివరకు ఏపీ సర్కారుకి బిగ్ షాక్ అని అన్నారు, అయితే కొందరు కావాలనే చేసిన అతస్య ప్రచారం అని వైసీపీ దీనిని కొట్టిపారేసింది.
అంతేకాదు దీనిపై కియ కూడా ప్రకటన చేసింది.. రాయిటర్స్ లాంటి పత్రిక ఇలాంటి వార్తలు రాయడం ఏమిటి అని విమర్శించింది.. అయితే దీనిపై కియ క్లారిటీ ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వం నుంచి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు .. ఏకంగా పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది, టీడీపీ ఈ విషయం లేవనెత్తింది, ఇటు కియ తాము ఇక్కడే ఉంటాము అని ప్రకటన చేసినా సరే తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావించడం అందరికి ఆశ్చర్యం కలిగించింది..
అసలు కియ ప్లాంట్ తమిళనాడుకు తరలిపోతోంది అనే వార్తలపై తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వార్తా కథనాలపై స్పందించింది. కియ ప్లాంట్ తరలింపు గురించి సమాచారం తమకు ఇంతవరకు లేదనీ.. అలాంటి సంప్రదింపులు కూడా ఏమీ జరగలేదని తమిళనాడు ప్రభుత్వం తేల్చిచెప్పింది.. అయితే ఎక్కడైనా ఒక కంపెనీస్టార్ట్ అయితే దాని అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి అంతేకాని అది తరలిపోదు అని తమిళనాడు అధికారులు తెలియచేశారు.