ఈ ఆలయంలో ప్రసాదంగా ఏమి పెడతారో తెలిస్తే షాక్

ఈ ఆలయంలో ప్రసాదంగా ఏమి పెడతారో తెలిస్తే షాక్

0
90

తమిళనాడు అంటేనే ఆలయాలకు ప్రసిద్ది అక్కడ వేలాది ఆలయాలు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అందుకే తమిళనాట భక్తి పారవశ్యం ఎక్కువగా ఉంటుంది, దక్షిణాదిన అధిక దేవాలయాలు ఉన్న ప్రాంతంగా తమిళనాడుని దేశంలో గుర్తింపు ఉంది.

ఈ రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. సాధారణంగా ఎక్కడైనా దేవుడి గుడిలో ప్రసాదం అంటే లడ్డు లేదా పులిహోర పొంగలి పెడతారు కాని ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

మునియాండి స్వామి ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ..ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండ్రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. ఇక్కడ ఆరోజు వెయ్యి కిలోలు బియ్యం, 250 మేకపోతులు అలాగే 300కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు, ఇదే ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు, దీనిని అందరూ ఇంటికి పార్శిల్ కూడా తీసుకువెళతారు.