‘తారక రామారావు తన పేరును తుపాకీ రావుగా మార్చుకో’

'Taraka Rama Rao change his name to Tupaki Rao'

0
94

నైరాశ్యంతోనే మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ చురకలు అంటించారు. తారక రామారావు తన పేరును తుపాకీ రావుగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్ళు, కేసులకు బీజేపీ కార్యకర్తలు బయపడరు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నమ్మించి మోసం చేసిందెవరో తెలంగాణ ప్రజలకు తెలుసు.

ఆకాశంపై ఉమ్మితే.. తన ముఖం మీదనే పడ్తోందని కేటీఆర్ గుర్తుంచుకోవాలి. 57 ఏళ్ళకే వృధాప్య ఫించన్ ఎప్పుడు ఇస్తారో మంత్రి కేటీఆర్ చెప్పాలి. సైనికులను కించపరిచే విధంగా.. చైనాకు అనుకూలంగా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పై వ్యతిరేకతను గమినించే.. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు. దళితులపై ప్రేముంటే‌ కేసీఆర్ 18 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. రాజ్యాంగాన్ని కాదు.. కేసీఆర్ ను మార్చాలని ప్రజలు నిర్ణయించారు.