ఎన్డీయేతర కూటమి..కేసీఆర్‌కు కొత్త తలనొప్పిగా మారిన కాంగ్రెస్?

0
34

ప్రస్తుత రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇప్పటివరకు రాష్ట్రాల పరిధిలో ఉన్న రాజకీయాలు ఇప్పుడు దేశ రాజకీయాల వైపు మళ్లాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మరో కూటమిని తయారు చేసేందుకు ఎన్డీయేతర సీఎంలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ముంబైలో కలిశారు.

వారు తాజాగా రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. దేశంలోని తీసుకురావాాల్సిన మార్పుల గురించి చర్చించారు. అయితే బీజేపీ, కాంగ్రేసేతర కూటమికి ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లేకుండా కూటమికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్త కూటమి.. కాంగ్రెస్ భాగస్వామ్యంపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పటికే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లాంటి వారితో కేసీఆర్ మాట్లాడారు. గతంలోనే కేసీఆర్…మోడీ సర్కార్‌ని గద్దె దించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా మళ్లీ ఇప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నయం సాధ్యమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ కలిసే వారంతా కాంగ్రెస్‌తో కలిసి పయనిస్తున్న వారే కావడం గమనార్హం. మరి అలాంటప్పుడు వారు కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ పెట్టడానికి ఒప్పుకోవడం కష్టమనే చెప్పాలి. అంటే కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్‌ని కూడా కలవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ పెడితే…మళ్ళీ బీజేపీకి ఉపయోగపడుతుంది. మరి చూడాలి ఈ ఫ్రంట్ రాజకీయాల్లో కాంగ్రెస్ కలిసి ఉంటుందా లేదా అనేది చూడాలి.