మేనిఫెస్టో విడుదల చేసిన టీ.కాంగ్రెస్

మేనిఫెస్టో విడుదల చేసిన టీ.కాంగ్రెస్

0
121

తెలంగాణ లో అసెంబ్లీ రద్దు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో… టీకాంగ్రెస్ కూడా ముందస్తుకు సమాయత్తమవుతోంది అని తెలుస్తుంది . టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఈరోజు భేటీ అయింది.ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీ… ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను ఖరారు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతున్నామో స్పష్టతనిచ్చింది. సమావేశానంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వివరాలను వెల్లడించారు.

మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా

గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇప్పుడు అదనంగా రూ. 2 లక్షలు

ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ… ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

కల్యాణలక్ష్మి సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ

అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న మొత్తాలు రెట్టింపు

విద్య, వైద్య సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు