రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కొత్త లుక్

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కొత్త లుక్

0
56

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నటిస్తోన్న తాజా చిత్రం షూటింగ్ అజర్‌ బైజాన్‌లో మంగళవారం నుంచి ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దానయ్య డీవీవీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం అజర్‌బైజాన్ దేశంలో చిత్రీకరణ జరుగుతున్నది. 25రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్‌ ద్వారా ఓ లుక్‌ రిలీజ్‌ చేసింది. ‘రఫ్‌ అండ్‌ రా లుక్‌..’ అంటూ చరణ్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో బ్యాక్‌ సైడ్‌ నుండి కనిపిస్తున్న లుక్‌ ఇది. గతంలో ‘రంగస్థలం’ సినిమాకి సంబంధించి సెట్స్‌ నుండి అదిరిపోయే చరణ్‌ లుక్స్‌ని ఉపాసన ఇలాగే ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేసింది. అలాగే ఇప్పుడు కూడా. ఈ లుక్‌లో చరణ్‌ని చూసి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో బ్యాక్‌ సైడ్‌ నుండి కనిపిస్తున్నాడు రామ్ చరణ్ .