తమిళ నటుడు సిద్ధార్థ్‌ భార్య ఆత్మహత్య

తమిళ నటుడు సిద్ధార్థ్‌ భార్య ఆత్మహత్య

0
58

తమిళనాడులోని మదురవాయల్‌లో కుటుంబ తగాదాల కారణంగా సినీనటుడి భార్య ఉరేసుకుని మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన సిద్ధార్థ్‌(35) మధుర వాయల్‌ అడయాలం పట్టులోని రెసిడెన్షియల్‌ క్వార్టర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ‘యాగ వారాయినుమ్‌ నా కాక్క’ అనే తమిళ సినిమాలో సిద్ధార్థ్‌ నటించాడు. ఆయన భార్య స్మిరిజ(32). ఇద్దరూ యాడ్‌ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇంటి దగ్గరే వెడ్డింగ్‌, రిసెప్షన్‌కార్డుల తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇటీవల వారిద్దరు తరచూ గొడవపడుతుండేవారు.

దీంతో స్మిరిజా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సిద్ధార్థ్‌ హాలులోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచిన సిద్ధార్థ్‌ 8.30 గంటలు అవుతున్నా భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపు తట్టి పిలిచాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మధురవాయిల్‌ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా స్మిరిజా ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవంగా వేలాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మిరిజా మృతదేహాన్ని శవపరిక్ష కోసం కీల్‌పాక్కం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు.