అసెంబ్లీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రకటించిన మూడు రాజధానుల మాటపై అందరూ ఎస్ చెప్పారు, ఇక్కడ వరకూ బాగానే ఉంది… అయితే తర్వాత ఈనెల 27న కేబినెట్ లో చర్చించనున్నారు అని తెలుస్తోంది ఈ అంశం.. అయితే అక్కడ ఎవరైనా జగన్ కు ఎదురు తిరుగుతారా ? అక్కడే కచ్చితంగా రాజధాని ఉండాలి ప్లేస్ మార్చద్దు అని చెప్పే సాహసం మంత్రులు ఎవరైనా చేస్తారా అని తెలుగుదేశం నేతలు చూస్తున్నారట.
అయితే అక్కడ ఎదురుతిరిగే నేతలు ఎవరూ లేరు అని. అందరూ ఒకటే స్వరం అని అంటున్నారు.. అయితే జగన్ కు ఇక్కడ పెద్ద నెగిటీవ్ వచ్చేది ఏమీ లేదు.. ముందు నుంచి అనుకున్న విధంగానే జగన్ కు అన్నీ ఇక్కడ పాజిటీవ్ అవ్వనున్నాయి అని తెలుస్తోంది. నేతలు కూడా ఎదురుచెప్పే అవకాశం లేదు అంటున్నారు.
అయితే కొందరు తెలుగుదేశం నేతలు మాత్రం కచ్చితంగా మంత్రులు కొందరు దీనిని వ్యతిరేకిస్తారు అంటున్నారు… కాని ఇక్కడ వీరు గమ నించాల్సింది మీడియాల ముందు ప్రజల ముందు చెప్పని నాయకులు కేబినెట్ భేటీలో ఏం చెబుతారు.. మొత్తానికి జగన్ కు ఇది నో కండిషన్స్ అనే విధంగానే ముందుకు సాగే నిర్ణయం అంటున్నారు మేధావి వర్గం.