బాబుకు షాక్… టీడీపీలో మరో బిగ్ వికేట్ డౌన్

బాబుకు షాక్... టీడీపీలో మరో బిగ్ వికేట్ డౌన్

0
82

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో ఎదురు దుబ్బ త్వరలో తగలనుందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడంతో పార్టీని ఓ గాడికి తీసుకువచ్చేందుకు వృద్దాప్యంలో కూడా చంద్రబాబు నాయుడు యువతతో కలిసి చలో ఆత్మకూరు పిలుపునిచ్చి తమ్ముళ్లను యాక్టివ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ఆపార్టీ నేతలు చాపకింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా ఇతర పార్టీ నాయకులతో మంతనాలు జరిపి జంప్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇటీవలే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో మరికొద్ది రోజుల్లో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తల వస్తున్నాయి.. అంతేకాదు ఈమేరకు ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటి అయ్యారు. దీంతో అందరు అఖిల ప్రియ బీజేపీలో చేరడం ఖాయంగా భావిస్తున్నారు.