దోస్త్ మేరా దోస్త్ అంటున్న… టీడీపీ బీజేపీ

దోస్త్ మేరా దోస్త్ అంటున్న... టీడీపీ బీజేపీ

0
79

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారని అన్నారు…

అలాగే ఇటీవలే టీడీపీ బీజేపీ ప్రస్తావనపై మరో ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ స్పందించారు… సుజనా టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ పార్టీపై ఆభిమానం ఉండొచ్చు అందుకే చంద్రబాబును బీజేపీకి దగ్గచేయాలనే ఆలోచన వచ్చినట్లు మాట్లాడిఉంటారని అన్నారు..

అయితే ఆయన మాట్లాడిని మాటలు తనకు తెలియదని అన్నారు… ఒక వేళ చంద్రబాబుతో బీజేపీ స్నేహం చేస్తే తమకు నష్టమే నని అన్నారు… రానురాను టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తోందని అన్నారు…. అయితే టీడీపీని బీజేపీలో చంద్రబాబు విలీనం చేస్తానంటే తాను అధిష్టానంతో మాట్లాడుతానని స్పష్టం చేశారు జీవీఎల్.