ఈ నెల 19న టీడీపీ చైతన్య యాత్ర ఎక్కడ నుంచో తెలిసి షాకైన వైసీపీ

ఈ నెల 19న టీడీపీ చైతన్య యాత్ర ఎక్కడ నుంచో తెలిసి షాకైన వైసీపీ

0
95

తెలుగుదేశం పార్టీ వైసీపీకి సమయం ఇవ్వడం లేదు, ఇక వైసీపీ పాలన గురించి వారు అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతోంది.. అలాగే పించన్లు రేషన్ కార్డుల రద్దు ఇలా అనేక అంశాలపై ప్రజల్లో వారి గురించి తెలియచేస్తాము అని చెబుతున్నారు. తాజాగా ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది.

చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ నెల 19 నుంచి 45 రోజుల పాటు టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు చేయనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్టూరులో చైతన్య యాత్ర ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చైతన్య యాత్రలు నిర్వహించనున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దుపై టీడీపీ పోరాటం చేస్తాము అని ముందే ప్రకటించింది.

అనుకున్న విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు…అయితే త్వరలో ఎక్కడెక్కడ ఈ యాత్రలు చేస్తారు ఎవరు పాల్గొంటారు అనేది కూడా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. దీనిపై వైసీపీ నేతలకు కచ్చితంగా గుణపాఠం చెబుతాము అంటున్నారు.