ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అలాగే ఎంపీ విజయసాయిరెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. వీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో కనీసం వీరికైనా అర్థం అవుతుందా అని ప్రశ్నించారు…
ఇసుక ఏమైనా వీడియో గేమ్ లో దొరికే వస్తువా లేక ఇసుక హ్యాక్ చేసారు అని చెత్త పత్రికలో రాసుకొని ఆనందపడుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు…
కొత్త విధానం అంటూ రెండు నెలలు ఇసుక ఆపేశారు. ఆ తరువాత వరద కారణంగా ఇసుక ఇవ్వలేకపోతున్నాం అని సెలవిచ్చారు. దొరికిన కాస్త ఇసుక ఇతర రాష్ట్రాల్లో అమ్మేసారని ఆయన మండిపడ్డారు. మరి ఇసుక హ్యాకింగ్ ఏంటి స్వామి? ఓట్లేసారు కదా అందరూ గొర్రెలు అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు బుద్దా…