వైఎస్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ

వైఎస్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ

0
95

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల పావురాలగుట్టలో మృతి చెందిన సంగతి తెలిసిందే… ఈ పావురాల గుట్టమీద మాంసపు ముక్కలను ఏరుకుంటున్న సమయంలో ఇంటిదగ్గర సంతకాలు చేయించుకున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు…

తాజాగా ఆయన మాజీ స్పీకర్ కోడెల సంతాప సభలో మాట్లాడుతూ… వైసీపీ పై పలు ఆరోపణలు చేశారు… ప్రస్తుతం అధికార వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు…

2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి తీసుకువస్తే అప్పుడే కోడెలకు అసలైన నివాళి అని అన్నారు… శవరాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులను ప్రతీ ఒక్కరు నిలదీయాలని జవహర్ పిలుపునిచ్చారు…