జగన్ ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకంపై టీడీపీ తాజా కౌంటర్ ఇది

జగన్ ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకంపై టీడీపీ తాజా కౌంటర్ ఇది

0
74

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట తప్పారా అంటే అవుననే అంటోంది ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను జగన్ తప్పారని ఆరోపించారు..

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతీ రైతుకు పెట్టుబడి సహాయం కింద 12500 ఇస్తామని చెప్పి ఇప్పుడు 7500 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారని ఆయ ఆరోపించారు…వైసీపీ వాలంటీర్లకు 8 వేలు రైతులకేమో 625 రూపాయలా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు…

అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడువకముందే జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు… వైసీపీ పాలనలో రైతులను కులాలవారిగా మతాలవారిగా విడదీశారని ఆయన ఆరోపించారు