ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. కోడెల మరణం నుంచి తమ్ముళ్లు కోలుకోకముందే మరోకీలక నేత కన్నుమూశారు…
కొద్దికాలంగా మూత్రపిండాలతో బాధపడుతున్నమాజీ ఎంపీ శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు… శివ ప్రసాద్ 1951 జులై 11న చిత్తూరు జిల్లాపొట్టిపల్లి గ్రామంలో జన్మించారు..
శివప్రసాద్ భార్య, ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. 2009, 2014 లో చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. శిప్రసాద్ పలు చిత్రాలలో దర్శకత్వంవహించారు