టీడీపీ ఫైర్ బ్రాండ్ కు బెయిల్…

టీడీపీ ఫైర్ బ్రాండ్ కు బెయిల్...

0
91

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేన ప్రభాకర్ కు బెయిల్ లభించింది… దీంతో పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు సంతోశాన్ని వ్యక్తం చేశారు…

తాజాగా ఆయనకు 18 కేసుల్లో బెయిల్ మంజూరు అయింది… ఈ సంవత్సరం ఆగస్ట్ 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫర్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయింది…

దీంతో ఆయన్ను సెప్టెంబర్ 11న పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు…. దీంతో ఆయనకు న్యాయస్థానం ప్రభాకర్ కు రిమాండ్ విధించింది… ఆ తర్వాత పీటీ వారెంట్ పై మరో 17 కేసుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే