టీడీపీ కంచుకోటకు బీటలు…

టీడీపీ కంచుకోటకు బీటలు...

0
96

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది… కీలక నేతల కాడినుంచి చోటా మోటా నాయకులు సైతం ఎవరి దారి వారు చేసుకుంటున్నారు… ఇప్పటికే చాలా మంది తమ్ముళ్లు వైసీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే… తాజాగా సుమారు రెండు వందల టీడీపీ కుటుంబాలు వైసీపీ తీర్ధం తీసుకున్నాయి…

వీరందరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… పార్టీలోకి చేరేందుకు వచ్చిన వారికి బాలనాగిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…

ఆతర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి వారు వైసీపీలో చేరారని తెలిపారు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని అందరికి అండగా ఉంటామని అన్నారు…