టీడీపీకి దూరం అవుతున్న కీలక నేత

టీడీపీకి దూరం అవుతున్న కీలక నేత

0
87

2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఒక్కొక్కరు సైకిల్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు… ఒకప్పుడు టీడీపీ రాజకీయాల్లో ఆరితేరిని నాయకులు సైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు… పార్టీ తరపున తమ వాయిస్ ఎంత వినిపించినా ప్రయోజనం లేదనే ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నారు…

ఇక మరికొదరు ముందు చూపుతో ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… ఇప్పటికే చాలామంది టీడీపీకి గుడ్ బై చెప్పారు… ఇక తాజాగా పార్టీకి చెందిన మరో కీలక టీడీపీ నేత పోతుల రామారావు మెల్లమెల్లగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు… చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు నిర్వహించిన ఏ పోరాటాల్లో ఆయన పాల్గొనలేదు…

దీంతో ఆయన టీడీపీని వీడాలనే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిర పోతులు 2016లో టీడీపీలో ఫిరాయించి ఫిరాయింపు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు… 2019లో టీడీపీ తరపున పోటీ చేసినప్పటికీ ఆయన గెలవలేకపోయారు..