తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే చాలా మంది నాయకులు ఎన్నికల ఫలితాల తర్వాత గుడ్ బై చెబుతున్నారు, తాజాగా కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీకి, కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలకనేత, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ నాయకులు టీడీపీ నేతలు షాక్ అయ్యారు..
కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన అంతగా పాల్గొనడం లేదు, అయితే టీడీపీ పై విమర్శలు చేసి వైసీపీ పై ప్రశంసలు చేశారు ఆయన.
పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుపడటం బాధాకరమన్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయం బాగుంది అని కితాబిచ్చారు..
కర్నూలుకు హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే రోజుల్లో తమ కార్యకర్తలు సన్నిహితులతో భేటీ అవుతానని వారి సలహా కోరిక మేరకు నేను రాజకీయ కార్యాచరణ చెబుతాను అని చెప్పారు, అయితే ఆయన వైసీపీలో చేరాలి అని భావిస్తున్నారట. త్వరలో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారు అని తెలుస్తోంది.