టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై

టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై

0
95

ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చాలా మంది పార్టీలో చేరుతున్నారు.. మరీ ముఖ్యంగా సీనియర్లు చాలా మంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.. మరీ ముఖ్యంగా ఇక్కడ పార్టీ తరపున తన వాయిస్ వినిపించే తెలుగుదేశం నేత , వైసీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నారట .మీడియా ముఖంగా ఆయన పెద్ద ఎత్తున పేరు గడించారు. ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అని తెలుస్తోంది.

అయితే ఆయనకు లోకేష్ కూడా బాగా సన్నిహితుడు కావడంతో, ఆయనను పార్టీ నుంచి వదులుకోకూడదు అని పార్టీ నేతలు భావిస్తున్నారు.. మరో పక్క ఆ జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు మాత్రం ఆయనని పార్టీలో చేర్చేందుకు తహతహలాడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మాజీ మంత్రి కూడా ఆ టీడీపీ నేతకు అండగా ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం తప్పకుండా ఎమ్మెల్సీ హామీ ఇస్తోందట.

ఇక తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ కూడా వచ్చే అవకాశం లేదు, ఈ సమయంలో ఆయన తెలుగుదేశంలో మరో ఐదు సంవత్సరాలు కొనసాగినా మరో 100 మీటింగులు మీడియా సమావేశాలు పెట్టి జగన్ పై విమర్శలు చేసినా వచ్చేది ఏమీ లేదు అని కేడర్ చెబుతోంది.. అంతేకాదు గతంలో కీలక పదవి అన్నారు అది కూడా బాబు ఇవ్వలేదు, అందుకే పార్టీ మారాలి అని ఆయనపై కేడర్ ఒత్తిడి పెంచింది అని తెలుస్తోంది.