2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం వారి పరిపాలనపై జనాలకు వచ్చిన వ్యతిరేఖత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .. జగన్ చేసిన పాదయత్రకి తోడు ఈ వ్యతిరేఖత రావడం వైసీపీ గెలుపుకి ఓ ప్లస్ అయిందనే చెప్పాలి .
అయితే ఇప్పుడు అదే వ్యతిరేకత వైసీపీ పై రావడానికి టైం దగ్గర పడిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు . దళితులపై ఎప్పుడైతే ఆధిపత్యం చెలాయిస్తామో అప్పటి నుంచి అధికారం సంగతి మర్చిపోవాల్సి వస్తుందని ,అక్రమ ఇసుక దందాని అడ్డుకున్న దళిత యువకుడిపై దాడిని ఓ దాష్టీక చర్యగా అయన పరిగణించారు . అయితే గతం లో చంద్రబాబు కూడా దళితులను తక్కువ చేసి మాట్లాడిన సంగతి అందరికి తెలిసిందే ,అయితే దాని ప్రభావం టీడీపీ పై తీవ్ర వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణమైంది .
అయితే సంఘటనను దృష్టిలో పెట్టుకుని బుధ్హ వెంకన్న ఈ వాక్యాలు చేసినట్టుగా తెలుస్తుంది .. ఇంకోసారి ఇలాంటి సంఘటన రిపీట్ అయిందంటే పార్టీ పతనానికి సమయం ఆసన్నమైనట్టే అన్నట్లుగా ఉన్నాయి బుద్దా వ్యాఖ్యలు .
టీడీపీకి పట్టిన గతే వైసీపీ కి వస్తుంది అంటున్న బుద్దా…
టీడీపీకి పట్టిన గతే వైసీపీ కి వస్తుంది అంటున్న బుద్దా...