టీడీపీకి మరో ఇద్దరు గుడ్ బై

టీడీపీకి మరో ఇద్దరు గుడ్ బై

0
79

తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు అనే వార్త వినిపించగానే తెలుగుదేశం పార్టీ కాస్త కంగారుపడుతోంది.. ముఖ్యంగా ఇప్పటికే వంశీ రేపిన చిచ్చుచల్లారక ముందే మరో ఇద్దరు నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారట ..అయితే చంద్రబాబుకు వీర భక్తులు అయిన వీరు ఇద్దరు కూడా పార్టీ మారాలి అని భావించారు.

అయితే బాబు ఇప్పటికే ఇద్దరిని రంగంలోకి దించి పార్టీ మారకూడదు అని చెప్పారట. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీకి చాలా సేవ చేశామని కాని మమ్మల్ని పట్టించుకోలేదని ఇఫ్పుడు కూడా తమకు అన్యాయం జరుగుతోందని చోటా మోటా నాయకులకు విలువ ఇస్తున్నారని, తమకు ఇవ్వడం లేదు అని అన్నారట.

అయితే తమకు పార్టీ తరపున 15 సంవత్సరాల నుంచి సరైన గుర్తింపు లేకపోవడం వల్ల తాము పార్టీకి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నాము అని తెలియచేశారట ఆ ఇద్దరు.