టీడీపీకి దూరం అయిన సీనియర్ నేత

టీడీపీకి దూరం అయిన సీనియర్ నేత

0
93

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు సైకిల్ కు దూరంగా ఉంటున్నారు…. మరికొందరు తన భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని వైపీపీలోకి లేందంటే బీజేపీలోకి జంప్ చేస్తున్నారు… రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని భావించి ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

ఇప్పటికే చాలా మంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… ఇదే క్రమంలో మరో కీలక నేత టీడీపీ దూరమయ్యే ఛాన్సస్ ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.. . ఫిరాయింపు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న పోతుల రామారావు ప్రస్తుతం టీడీపీ దూరంగా ఉన్నారు…

2014 వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు… అయితే ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీడీపీలోకి జంప్ చేశారు… ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కూడా ఆయన గెలవలేకపోయారు… ఇటీవలే ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు ఆందోళనకు పిలుపునిచ్చారు కానీ ఆయన హాజరు కాలేదు… దీంతో పోతులు రామారావు టీడీపీ దూరం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది…