వివాహేతర సంబంధం పెట్టుకున్న టీడీపీ నేతకు జైలు శిక్ష

వివాహేతర సంబంధం పెట్టుకున్న టీడీపీ నేతకు జైలు శిక్ష

0
80

తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ టీడీపీ నేత జైలుపాలు అయ్యారు… ఈ సంఘటన అనంతపురం బత్తలపల్లిలో మూడు సంవత్సరాల క్రితం చోటు చేసుకుంది… ఇటీవలే విచారణలో నేరం రుజువు కావడంతో భావా మరదలికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం…..

ఇది వరకే వివాహం అయిన తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు టీడీపీ నేత ఈశ్వరయ్య. విషయం తెలుసుకున్న ఆమె భర్త తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

దీంతో మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఈమె ఫిర్యాదు మేరకు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు… తాజాగా నేరం రుజువు కావడంతో భావా మరదలికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం…