వైసీపీలోకి కీలక టీడీపీ నేత

వైసీపీలోకి కీలక టీడీపీ నేత

0
119

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి… ఈ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి వైసీపీలో చేరుతున్నారు…

ఇప్పటికే కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిదే… ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరే ఛాన్సస్ ఎక్కువగా ఉన్నారు…

ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేసిన సంగతి కూడా తెలిసిందే… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో కీలక నేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా వైసీపీలో చేరారు…