టీడీపీలో ఈ బాధితుల లిస్ట్ చాలా ఉందట

టీడీపీలో ఈ బాధితుల లిస్ట్ చాలా ఉందట

0
84

తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇప్పుడు ఒకటే ఆలోచన చేస్తున్నారు.. భూములు రాజధానిలో కొనుగోలు చేసిన వారి పరిస్దితి ఏమిటి? దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే భూములు 2 కోట్లు మూడు కోట్ల రూపాయలు పెట్టి ఎకరాలు కొన్నారట… పైగా రాజధాని అవుతుంది అని ఆశలతో ఇలా పెట్టుబడి పెట్టారు.

అయితే కొందరు ఆస్తులు అమ్మి కొంటే మరికొందరు అప్పులు చేసి కొన్నారట.. వీరందరికి ఇప్పుడు జగన్ షాక్ ఇచ్చారు అనే చర్చించుకుంటున్నారు.తెలుగుదేశం పార్టీలో చిన్నా చితక లీడర్లు సుమారు ఇలా 100 మంది పైనే ఉన్నారట.. అయితే విశాఖకు రాజధాని తరలిపోతే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఓ రెండు మూడేళ్లు జరుగుతాయి ..

తర్వాత పరిస్దితి ఏమిటి అనే టెన్షన్ కూడా వారిలో ఉంది… అయితే టీడీపీలో ఇలాంటి నాయకులు చాలా మంది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఎకరాం 20 లక్షల రూపాయలకు పడిపోతుందని భయపడుతున్నారు, మొత్తానికి రాజధానిని రియల్ ఎస్టేట్ గా మార్చేద్దాం అనుకున్న వారికి చాలా ఎదురుదెబ్బ తగిలింది అని చర్చించుకుంటున్నారు సామాన్య జనం.