ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి… అధికారంలో ఉన్నప్పుడు కళకలలాడిన టీడీపీ ఇప్పుడ అధికారం కోల్పోవడంతో ఆ కళ చెదిరింది.
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను బట్టి చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం తీసుకోగా ఇటీవలే జూపూడి వైసీపీ తీర్థం తీసుకున్నారు…
ఇక ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీనేత కువ్వారపు బాలాజీతో పాటు వందలమంది మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… వీరందరు జగన్ చేస్తున్న అభివృద్దిని చూసి వైసీపీలో చేరారు..