టీడీపీనుంచి వైసీపీలోకి భారీ వలసలు

టీడీపీనుంచి వైసీపీలోకి భారీ వలసలు

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటినుంచి రాష్ట్రాన్ని అభివ్రుద్ది దిశగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులు అయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ ను వీడి ఫ్యాన్ చెంతకు చేరుతున్నారు.

తాజాగా టీడీపీకీ చెందిన సుమారు 150 కుటుంబాలు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ… దివంగత యార్లగడ్డ రంగారావు కుటుంబ సభ్యులు వైసీపీ తీర్ధం తీసుకోవడాన్ని అభినందించారు…

జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ఆయన చేపడుతున్న ప్రజా రంజక పాలన నచ్చి మెచ్చి పార్టీలోకి పలువురు రావడం శుభపరినామం అని కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.