వంశీ తర్వాత మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్దమైన టీడీపీ నేతలు

వంశీ తర్వాత మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్దమైన టీడీపీ నేతలు

0
106

2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలో నేతల సంఖ్య తగ్గుతూ వస్తోంది… ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే…. ఇక వీరి తర్వాత మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు…

ఇక తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీకి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు వాట్సప్ ద్వారా పంపారు… ఇక ఆయనతోపాటు నియోజకవర్గానికి చెందిన సుమారు నాలుగు మండలాలు కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు…

వంశీ ఎక్కడ ఉంటే తాము కూడా అక్కడే ఉంటామని కార్యకర్తలు అంటున్నారు… తమను కూడా వంశీ రాజీనామా చేయాలని చెప్పలేదని ఆయన రాజీనామా చేశారు కాబట్టే తాము కూడా టీడీపీలో ఉండమని అంటున్నారు…