రాజధాని అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూజాన వేసుకుని ధర్నాలు దీక్షలు చేస్తుంటే ఆపార్టీకి చెందిన తమ్ముళ్లు మాత్రం ఇంటికే పరిమిత అవుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది… ముఖ్యంగా గుంటూరు జిల్లాలో టీడీపీ ఊసు పెద్దగా లేదని చర్చించుకుంటున్నారు…
ప్రస్తుతం నాయకులు ఎవ్వరు ముందుకు రాకున్నారట.. జిల్లాలో మోస్ట్ సీనియర్లు ఉన్నా కూడా బయటకు రాకున్నారు… అప్పుడప్పు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ పై పలు విమర్శలు చేస్తున్నారు తప్ప పార్టీకోసం ఏం చేయకున్నారని గుంటూరు జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు… జిల్లాల్లో ఇంత క్లిష్టమైన పరిస్థితిలో రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఊపు కనిపిస్తోంది…
బాపట్లలో వేగేశ్న నరేంద్ర వర్మ దూకుడుగా కొనసాగుతున్నారు రెండేళ్లకు ముందు నాటినుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వర్మ 2019 ఎన్నికల్లో టికెట్ రాకపోయినా తన దూకుడును మాత్రం తగ్గించకున్నారు… అలాగే నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబు దూకుడుగా పని చేస్తున్నారు… ప్రజల పక్షాన నిలుస్తూ అధికార నాయకులను ప్రశ్నిస్తున్నారు…