డిసెంబర్ 9 నుంచి ఆంధ్రప్రశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి… మొత్తం పది రోజుల పాటు శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహిచాలని ప్రభుత్వం యోచిస్తోంది… ముఖ్యంగా ఈ సమావేశంలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, మధ్యపాన నిషేదం, పొలవరం, అమరాతి వంటి అంశాలపై శీతాకాల సమావేశాల్లో వేడిపుట్టించనున్నాయి…
ప్రస్తుతం టీడీపీకి బలం 23 మంది అందులో వంశీ టీడీపీకి రాజీనామా చేశారు కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు ఇప్పుడు అసెంబ్లీలో ఆయన రూటు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతారోనని చర్చ తీవ్రంగా సాగుతోంది… పార్టీకి రాజీనామా చేసేముందు చంద్రబాబు నాయుడు పై ఆయన కుమారుడు లోకేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వంశీ…
ఇదే తరహాలోనే మరోసారి అసెంబ్లీలో తన వాయిస్ ను వినిపిస్తారని తెలుస్తోంది… అలాగే గంటా శ్రీనివాస్ వ్యవహారం కూడా చర్చ సాగుతోంది… ఇటీవలే పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కు గంటా హాజరు కావాలని అధిష్టానం సూచించినప్పటికీ ఆయన హాజరుకాలేదు…
ఇటీవలే పార్టీ తరపు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆయన హాజరు కాలేదు మరి ఇప్పుడు డిసెంబర్ 9 జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనేది చూడాలి…. మొత్తం మీద చూస్తే వంశీ గంటా టీడీపీని టెన్షన్ పుట్టిస్తున్నారనే చెప్పాలి..