టీడీపీలో ఆ కీలక పదవిని చంద్రబాబు ఎవరికి ఫిక్స్ చేస్తారు…

టీడీపీలో ఆ కీలక పదవిని చంద్రబాబు ఎవరికి ఫిక్స్ చేస్తారు...

0
93

ఏపీ లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.. తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకునే పనిలో ఉండటంతో పార్టీలో ప్రస్తుతం ఎవరు ఉంటారో ఎవరు ఊడుతారో చెప్పలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కీలక పదవి కేటాయించకున్నారని వార్తలు వస్తున్నాయి…

ఆపదవే తెలుగు యువత… ఆ పదవి ఎంత కీలమో అందరికీ తెలుసు గతంలో ఈ పదవి చేపట్టిన వారు అమర్నాథ్ రెడ్డి, కొడాలి నాని వంటివారు ఎంత బలమైన నేతలుగా ఎదిగారో అందరికీ తెలిసిందే… ఆ తర్వాత ఈ బాధ్యతలను దేవినేని అవినాష్ చేట్టారు… అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అవినాష్ సైకిల్ దిగి వైసీపీ తీర్థం తీసుకున్నారు…

దీంతో తెలుగు యువత పోస్ట్ ఖాళీ అయింది… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిరోజులకే దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం తీసుకున్నారు.. ఆ తర్వాత నుంచి తెలుగు యువత బాధ్యతలను ఎవ్వరికి అప్పగించలేదు అధిష్టానం… ఇప్పుడు ఈ పదవికోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు… రాయలసీమలో చాలామంది యువ రాజకీయ నేతలు ఈ పదవికోసం ఎదురు చూస్తున్నారు… మరి చంద్రబాబు నాయుడు ఆ పదవి ఎవరికి ఫిక్స్ చేస్తారో చూడాలి…