టీడీపీలో చంద్రబాబు సంచలన నిర్ణయం

టీడీపీలో చంద్రబాబు సంచలన నిర్ణయం

0
81

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమితో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. పార్టీకి ఇది దారుణమైన ఓటమి అనే చెప్పాలి… అయితే యువ నేతల కొరత అనేది పార్టీని వేధిస్తోంది. అది కూడా ఇప్పుడు టీడీపీ గుర్తించింది… తాజాగా పార్టీలో యువతకు పెద్ద పీట వేసేందుకు సిద్దం అయ్యారు. యువతకు పార్టీ పదవుల్లో 33 శాతం కోటాను అమలు చేయాలని నిర్ణయించారు.

అంతేకాదు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తున్నాం. 35 ఏళ్లలోపు వారికి పార్టీలో 33 శాతం పదవులు ఇవ్వనున్నాం. యువతతో పార్టీ అనుసంధానం మరింత పెరగాలి. యువతరం మరింత మమేకం కావాలి అని చంద్రబాబు చెప్పారు, అలాగే యువత సీనియర్లను చూసి నేర్చుకోవాలని వారిలా కష్టపడి పనిచేయాలి అని చెప్పారు, ఇటు సీనియర్లు యువత ఇద్దరూ కలిసి పని చేస్తే విజయాలు వస్తాయి అని చెప్పారు, తాాజాగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడంతో ద్వితీయ శ్రేణిలో ఉన్న యువ నేతలు ఆనందంలో ఉన్నారు.