టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్..

టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్..

0
81

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ లమీద షాకులు తగులుతున్నాయి…. హోరా హోరీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న నేపథ్యంలో ఆపార్టీ నాయకులు మూటాముళ్ళు సర్దేస్తున్నారు…

రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో ఉన్న ఫలంగా తమ్ముళ్లు టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు… అయితే ఇప్పటికే పలువురు సీనియర్, జూనియర్ నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే ఇదే క్రమంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని కూడా త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు…

ఎన్నికల ఫలితాల నుంచి సైలెంట్ గా ఉన్న యామిని గతంలో పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి… కానీ దానిపై ఆమె అప్పట్లో క్లారిటీ ఇవ్వలేదు… ఇప్పుడు యామిని పార్టీకి రాజీనామా చేయడం ఖాయం అయింది… అంతేకాదు త్వరలోనే తన భవిష్యత్ కార్యచణను కూడా ప్రకటించనున్నారు యామిని