టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్… కానీ నో ఎంట్రీ అంటున్న వైసీపీ

టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్... కానీ నో ఎంట్రీ అంటున్న వైసీపీ

0
89

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అధికార వైసీపీ కంచుకోటగా పిలువబడుతున్న కర్నూల్ జిల్లాలో మరో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… ఇటీవలే పార్టీలో చేరికపై జనార్థన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి..

అయితే ఆయన రాకను ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డిలు వ్యతిరేకిస్తున్నారు… కాగా 2019 ఎన్నికల్లో జనార్థన్ రెడ్డి టీడీపీ తరపున పోటీచేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే…