టీడీపీలో మరో చింతమనేని రె‘డీ’

టీడీపీలో మరో చింతమనేని రె‘డీ’

0
75

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన అక్రమాలపై అధికారులు కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు… అయితే ప్రస్తుతం ఆయనలాగే మరో టీడీపీ ఎమ్మెల్యే తయారు అయ్యారు… ప్రస్తుతం ఆయన దూకుడు చూస్తుంటే మరో చింతమనేని టీడీపీలో తయారు అయ్యారని అంటున్నారు అదే పార్టీ నేతలు…

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు… టీడీపీ తరపున హ్యట్రిక్ విజయాలు సొంత చేసుకున్న ఆయన ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంటున్నారు..

ఇటీవలే చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా వెలగపూడి అనుమతి లేకుండా ర్యాలీ చేయడం అలాగే ఏకంగా పోలీసులనే నిలదీయడం చేశారు…. ఈ క్రమంలో ఆయనపై వరుసగా నాలుగు ఐదు కేసులు నమోదు చేశారు పోలీసులు…