టీడీపీలో ఈ లేడీ లీడర్ కు కరోనా టైమ్ లో భారీగా పెరుగుతున్న క్రేజ్…

టీడీపీలో ఈ లేడీ లీడర్ కు కరోనా టైమ్ లో భారీగా పెరుగుతున్న క్రేజ్...

0
117

ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోటగా పిలిచేవారు కానీ 2019లో జగన్ సునామితో ఆ కంచుకోట బద్దలు అయింది… ఈ జిల్లాలో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని తమ అడ్డాగా మర్చుకుంది… గత ఎన్నికల్లో టీడీపీ పక్కా గెలుస్తామన్న స్థానాలను కూడా వైసీపీ గెలుచుకుని సంచలనం సృష్టించింది… అందులో ఒకట చింతలపూడి.. ఈ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడు..

2014ఎన్నికల్లో పీతల సుజాత టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు… ఆతర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు… నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మాగంటి బాబు దెందులూరు అప్పటి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జోక్యం చేసుకుని పెత్తనం చలాయించారు… అయినా కూడా పీతల సూజతా ప్రజల మధ్యలోనే ఉండేవారు.. ఇక 2019లో చింతలపూడిలో ఆమెకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు కర్రా రాజారావుకు కేటాయించారు…

అయితే ఆయన పోటీ చేసినప్పటికీ ఓటమి చెందారు… ఇక ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదు.. ఇక మాగటి రాజకీయం కూడా ముగిసినట్లే ప్రస్తుతం ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.. చింతమనేని ప్రభాకర్ తన సమస్యలకే పరిమితం అయ్యరు… అయితే పితల సుజాతకు టికెట్ ఇవ్వకపోయినా కూడా నియోజకవర్గంలో ప్రజల వెంటే ఉన్నారు.. కరోనా టైమ్ లో ఆమె ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తున్నారు…గతంలో పీతలను వద్దన్న వారు కూడా ఇప్పుడు ఆమెకు జై కోడుతున్నారు… ఆమె అనుచరులు పార్టీ మారినా కూడా ఆమె నయకత్వామే కోరుకుంటున్నారు…