23 మందిలో వైసీపీ ఐదుగురిపై టార్గెట్

23 మందిలో వైసీపీ ఐదుగురిపై టార్గెట్

0
94

ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 స్ధానాలు గెలుచుకుంది.. అలాగే తెలుగుదేశం 23 స్ధానాలు గెలుచుకుంది …జనసేన కేవలం ఒకే ఒక్క స్ధానం గెలుచుకుంది… అయితే తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 స్ధానాల్లో ఒకరు వంశీ, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.. మరి ఇక మిగిలింది 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ..అయితే గెలిచిన 23 మందిలో చంద్రబాబు సామాజిక వర్గం వారు దాదాపు 11 మంది ఉన్నారు అని తెలుస్తోంది.

అయితే అదే వైసీపీ టార్గెట్ అని టీడీపీ భావిస్తోందట… బాబు అనుకున్న సీట్లు గెలిచాయి దీంతో వైసీపీ ప్లాన్ వర్క్ అవ్వలేదు అని అంటున్నారు… వీరిలో సగానికి సగం మందిని వైసీపీలో చేర్చుకోవాలి అని పక్కా ప్లాన్ వేశారని అందుకే టీడీపీ వారి ఎత్తులు చిత్తు చేస్తోందట.. ఇందులో చంద్రబాబు, బాలయ్య కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు, అందుకే పార్టీలో చేర్చుకునేందుకు మరో ఐదుగురు నేతలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది అని, అందుకే ఎమ్మెల్యేలని చేజార్చుకోకుండా ఉండాలి అని భావిస్తోందట తెలుగుదేశం పార్టీ.