టీడీపీ ప్రధాన పిల్లర్ కూడా వైసీపీకి టచ్ లో

టీడీపీ ప్రధాన పిల్లర్ కూడా వైసీపీకి టచ్ లో

0
95

టీడీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని సోసల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అంతేకాదు ఆయన వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి…

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట… తన వర్గం వారికి టికెట్లు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆయన అసంతృప్తి చేందారట… ఈ అసంతృప్తితోనే ఆయన పార్టీ వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఇదే విషయమై ఆయన తన అనుచరులతో సమావేశం అవ్వనున్నారట… ఆనుచరులతో చర్చించిన తర్వాత ఆయన తన నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి… కాగా ఇప్పటికే చాలామంది టీడీపీ నేతల వైసీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే…

కాగా ఎప్పటి నుంచో కేఈ ఫ్యామిలీ కర్నూల్ జిల్లా రాజకీయాలను ఒంటి చేతితో శాసిస్తోంది… అలాంటి ఫ్యామిలీ పార్టీ వీడితే కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు…