టీడీపీ మాస్టర్ ప్లాన్…. వంశీ దారి ఎటువైపు

టీడీడీపీ మాస్టర్ ప్లాన్.... వంశీ దారి ఎటువైపు

0
93

ఏపీలో మూడు రాజధానులపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అమరావతిలో ఈనెల 20న ప్రత్యేకంగా ఈ అంశంపై అసెంబ్లీలో సమావేశం కానుంది… మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది…

ఈ సమావేశంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటు వేయాలని విప్ ను జారీ చేసింది… ఈమేరకు విప్ డీబీవీ స్వామి వల్లభనేని వంశీకి లేఖ కూడా పంపారు… ఈ సారి వంశీతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు విప్ ను దిక్కరించి అసెంబ్లీ సమావేశాల్లో ఓటు వేస్తే వారి మీద స్పీకర్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది….

కాగా ఇటీవలే వంశీ టీడీపీకి రెబల్ గా మారిన సంగతి తెలిసిందే… లోకేశ్ పై అలాగే చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… అలాగే విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా విశాఖ రాజధానికి ఓటు వేసిన సంగతి తెలిసిందే మరి చూడాలి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో…